![]() |
![]() |

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -20 లో....సీతాకాంత్ ఆఫర్ చేసిన డ్రైవర్ జాబ్ కి రామలక్ష్మి ఒప్పుకొని వాళ్ళ ఇంటికి వస్తుంది. సీతాకాంత్ వాళ్ళ ఇల్లు చూసి ఆశ్చర్యపోతుంది. పిఏ ఇంకా డ్రైవర్ ఇద్దరు రామలక్ష్మి రావడం చూసి షాక్ అవుతారు. మంచి నిర్ణయం తీసుకున్నారంటు రామలక్ష్మితో అంటారు.
ఆ తర్వాత రామలక్ష్మి వచ్చిందని పెద్దాయన తో చెప్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతు.. ఇదిగో కార్ కీస్ డ్యూటీలో జాయిన్ అయిపోమని అతను రామలక్ష్మికి చెప్తాడు. రామలక్ష్మి కార్ క్లీన్ చేస్తుంటే వద్దని పెద్దాయన చెప్తాడు. నా డ్యూటీ నేను చేస్తున్నానని రామలక్ష్మి సమాధానం చెప్తుంది.. ఆ తర్వాత శ్రీవల్లి వచ్చి ఏంటి లేడీ డ్రైవర్ ఆ అని ఆశ్చర్యపోతుంది. ఈ అమ్మాయే ఆ రోజు కార్ పై కలర్ పోసిందని పెద్దాయన చెప్తాడు. అప్పుడే శ్రీలత వస్తుంది. రామలక్ష్మిని చూసి షాక్ అవుతుంది. తనతో గతంలో గొడవ పడ్డ సంఘటన గుర్తుకు చేసుకుంటుంది. అబ్బో ఈవిడ ఇంట్లోకే వచ్చేనా అని రామలక్ష్మి అనుకుంటుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్? ఎవరు రమ్మన్నారని శ్రీలత కోప్పడుతుంది. నేనే రమ్మన్నానని సీతాకాంత్ చెప్పడంతో శ్రీలత షాక్ అవుతుంది. నేను డ్రైవర్ గా ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చానని సీతాకాంత్ చెప్తాడు. ఎవరిని అడిగి ఇచ్చావ్? ఎందుకు ఇచ్చావని సీతాకాంత్ పై శ్రీలత కోప్పడుతుంది. నాకు ఆ అమ్మాయి ఇక్కడ జాబ్ చెయ్యడం ఇష్టం లేదని శ్రీలత చెప్తుంది. నా వల్ల మీకు గొడవలు ఎందుకని చెప్పి రామలక్ష్మి వెళ్తుంటే.. నేను పిలిస్తే వచ్చావ్. నేను వెళ్ళమంటే వెళ్దువు అగమని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. నిన్ను అడగకుండా ఈ జాబ్ ఇవ్వడం నా తప్పు.. నేను ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మని చెప్పింది నీకు పరిచయం చెయ్యడానికని సీతాకాంత్ అంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు నా రింగ్ తీసుకొని వచ్చి ఇచ్చిన అమ్మాయని సీతాకాంత్ చెప్తాడు.. నీ మీద ఉన్న ఇష్టంతో ఆ అమ్మయి అంటే ఇష్టం లేకున్నా ఇక్కడ జాబ్ చెయ్యడానికి ఒప్పుకుంటున్నానని శ్రీలత చెప్పి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత పెద్దాయన సిరికి రామలక్ష్మిని చూపించి నువ్వు కలవాలన్న అమ్మాయి తనే అని చెప్పగానే.. చాలా బాగుంది అన్నయ్యకి కరెక్ట్ జోడీ అని సిరి చెప్తుంది. ఆ తర్వాత సిరి వెళ్లి రామలక్ష్మిని పరిచయం చేసుకుంటుంది. ఇద్దరు ప్రెండ్స్ అయిపోతారు. ఇక రామలక్ష్మికి సీతాకాంత్ కొన్ని కండిషన్స్ పెడతాడు.. రామలక్ష్మి కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది. రామలక్ష్మి పెట్టిన ఫ్యామిలీకి సంబంధించిన కండషన్ కి సీతకాంత్ ఫిదా అయిపోయి నాలాగే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుందని అనుకోని అన్ని కండిషన్స్ కి సీతాకాంత్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |